అమావాస్య అర్ధరాత్రి
చీకటి ఏ వస్తువునూ చూపదు. అలా అని, ఏ నిజాన్నీ దాచదు. పున్నమినాటి వెన్నెల్లో తీయని ప్రేమగీతం ఉంది. అమావాస్య చీకట్లో చేదైన విరహగీతం ఉంది. ఆ గీతం చెప్పిన నిజమే ‘అమావాస్య’! సముద్రంలో ఉన్నట్లే మనిషి శరీరంలో కూడా నీరు ఉంటుంది. సముద్రంలో ఉన్నట్లే మనిషి జీవితంలోనూ ఆటుపోట్లు ఉంటాయి. చంద్రుడు సముద్రం మీద ప్రభావం చూపినట్లే మనిషి రక్తం మీద కూడా ప్రభావం చూపుతాడు. తాను లేకుండా పోయి ‘అమావాస్య’ ను సృష్టిస్తాడు. ఆ చీకటిరోజుల్లో మనిషి ఎదుర్కొనే విచిత్రభయానకమైన అనుభవాలు ఏమిటి? శాస్ర్తీయ పునాదుల మీద నిలబడని ఆ బలమైన వాస్తవాలు ఎలాంటివి?
ఇది కొన్ని యదార్థాల నుంచి అల్లుకున్న కాల్పనిక కథ అనుకోండి. లేదా కాల్పనికత నుంచి అల్లిన యదార్థ భ్రమజనిత కథగా నమ్మండి. మీ ఇష్టం. కొన్ని సంవత్సరాల క్రితం లంకపాలెం (ఊరి పేరు మార్చలేదు) అనే గ్రామంలో ఏం జరిగిందో తెలుసా?
ఆ రాత్రి... మిగిలిన రాత్రుల వలే లేదు. ఏ దిక్కు చూసినా కాటుకలాంటి నలుపే ఎదురొస్తోంది. చిటపట చినుకులు ఎండు ఆకుల మీద వింతగా శబ్దిస్తున్నాయి. ఊరు గురక పెడుతోంది. కుక్క మొరగడానికి ఎందుకో సంశయిస్తోంది. పరిసరాలను భయభయంగా చూస్తోంది. చినుకుల శబ్దం ఆగిపోవడంతో భారమైన నిశ్శబ్దం అణువణువూ అల్లుకొని ఉంది. ఇళ్లలో పడుకుని ఉన్న వాళ్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బయటికి స్పష్టంగా వినిపించే ఆ నిశ్శబ్దంలో...
ఒకానొక భయానకమైన కేక!
వో....
రా.....రా
వో....లే....రా
తూర్పున ఉన్న నాగభూషణం (పేరు మార్చలేదు) ఇంట్లో నుంచి వినిపించింది.
ఊరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
ఏం జరిగింది? ఏం జరుగుతోంది? తెలుసుకోవడానికి అందరూ బయటికి వచ్చారు. కేకలు వినిపిస్తున్న ఇంటివైపు పరుగెత్తారు. స్ర్తీల కంఠాలు మృదువుగా ఉంటాయి. కన్నీళ్లల్లో, నవ్వులలో కూడా! కాని కేకలు వేసే ఆ స్ర్తీ కంఠంలో మృదుత్వం ఎక్కడా లేదు. రాత్రి ఒంటిగంట సమయంలో శ్మశానంలో కాలుతున్న శవాలను చూస్తూ నిశ్చింతగా పడుకునే వారు కూడా జడిసి పారిపోయే కేకలవి. జనాలందరూ ఆ ఇంటి తలుపులు దబదబా బాదారు. నాగభూషణం తలుపు తెరిచాడు. అతని కొడుకు, మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు వెంకటేశ్వర్లు మెడ వాల్చేసి దీనంగా చూస్తున్నాడు.
‘‘ఏమిటయ్యా... మీ ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి’’ - పెద్దమనిషి ఎవరో అడిగారు.
‘‘మా కోడలుపిల్ల అరుపులు... ఏం జరిగిందమ్మా అంటే ఏమీ చెప్పడం లేదు. పిచ్చి పిచ్చిగా చూస్తోంది. గంట నుంచి వో....రా....వో.... అనే అరుస్తోంది. ఏం చేయాలో తెలియడం లేదు’’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాగభూషణం. ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఒక ముసలాయన మాత్రం తన తెల్లగడ్డాన్ని నిమురుకుంటూ ‘‘ఈరోజు అమావాస్య కదా. అలాగే ఉంటుంది’’ అన్నాడు. ఆయన మాటలు ఎవరికీ అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి చాలా మంది సొంతంగా ప్రయత్నిస్తున్నారు.
* * *
లక్ష్మీనారాయణకు పిచ్చి అనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అతని మానసిక వైకల్యం ఎప్పుడూ ఎవరికీ ఏ ఇబ్బంది కలిగించలేదు. ‘పిచ్చోడా’ అని పిల్లలు వెక్కిరించినా అదోలా నవ్వుతాడే తప్ప ఎవరినీ ఏమీ అనడు. అలాంటి లక్ష్మీనారాయణ అమావాస్య రోజుల్లో మాత్రం రౌద్రంగా ఉంటాడు. కన్నెర్ర చేస్తాడు. పన్నెర్ర చేస్తాడు. నిద్రపోయినట్లే పోయి చటుక్కున లేస్తాడు. ‘‘ఎప్పుడూ శాంతంగా ఉండే నీ కొడుక్కి ఏమైంది ఇవ్వాళ’’ అని ఇరుగువారో పొరుగు వారో అడిగితే-
‘‘ఇవ్వాళ అమావాస్య కదా’’ అంటాడు వాళ్ల నాన్న.
* * *
మూడు రోజులుగా వాన జోరుగా కురుస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంతం మలేరియా సోకిన రోగిలా గజగజ వణికి పోతోంది. ‘‘లంక గ్రామాల్లో చేరిన నీరు అలాగే ఉంది. ఎగువ నుంచి నీటిరాక తగ్గినప్పటికీ ఈ రోజు అమావాస్య కావడంతో సముద్రం నీటిని లాక్కునే పరిస్థితి కనిపించడం లేదు. చాలా గ్రామాలు ముంపునీటిలోనే ఉన్నాయి’’ అని టీవీ యాంకరయ్య ఫుల్‌స్టాప్, కామాలు లేకుండా చెప్పుకుంటూ పోతున్నాడు.
అమావాస్య రోజు సముద్రం నీటిని లాక్కోదా?!
* * *
అవావాస్య రోజు ఏమిటీ విపరీతాలు? అమావాస్య మంచిరోజు కాదా? భయానికి చీకటి సంకేతమైనట్లే, అమావాస్యకు అరుపులు, అవాంఛనీయమైన పరిణామాలు సంకేతమా? ‘అమావాస్య రేయి అలా ఆగిపోయి...’ అని ఆశాదీపం వెలిగించుకోవడానికి కారణం... అమావాస్య అంటే మనలో ఉండే భయమే కారణమా?! ఖండించడమా, ఆమోదించడమా? అనుభవాలే చెబుతాయి.
అమావాస్య రోజు ఆకాశం నల్లగా ఉంటుంది. ఆ నలుపు ఆక్రోశానికి, నిరసనకు ప్రతీక. సముద్రం కల్లోలంగా ఉంటుంది. ప్రేమ నిరాకరించబడిన స్ర్తీ హృదయపు వేదనే ఆ భయానకమైన కల్లోలం. కుక్కలు అర్ధరాత్రి సమయంలో ఆకాశం వైపు చూస్తూ వింత స్వరంతో రోదిస్తుంటాయి. మానవమాత్రులకు అది జంతువుల ఏడుపు మాత్రమే. కొందరు తాత్వికశిఖామణులకు మాత్రం ఆ రోదనలో పాతగాయాల దుఃఖం సజీవంగా కనిపించింది. మనిషి ప్రతి చేష్టకు సంకల్పితంగానో, అసంకల్పితంగానో అర్థం, పరమార్థం ఉన్నట్లే ప్రకృతిలోని ప్రతి కదలికకు అదే అర్థం, పరమార్థం ఉంటుంది.
విరహప్రేమికులు లంకపాలెం అమ్మాయి మాదిరిగా ఏ అర్ధరాత్రో‘వో...’ అని పెద్దగా అరవవచ్చు. అణచివేసుకున్న కోరిక, అదుపులో పెట్టుకున్న ఓపిక కట్టలు తెగిపోయి లక్ష్మీనారాయణ మాదిరిగా వెల్లువెత్తిన ఆగ్రహజ్వాల కావొచ్చు. ముంపు బాధిత గ్రామాలు సముద్రుడి వైపు దీనంగా చూడవచ్చు. ప్రయాణాల్లో అపస్వరాలు వినిపించవచ్చు. మీరు ఈసారి అమావాస్య రోజున ఆకాశాన్ని సుమారు అయిదు నిమిషాల పాటు ఏకాగ్రచిత్తంతో అదే పనిగా చూడండి. ఒక స్ర్తీ కనిపిస్తుంది. రోదన వినిపిస్తుంది.
‘‘నిన్ను ప్రేమించాను...’’ అనే భయానకమైన శబ్దం మార్మికంగా వినిపిస్తుంది. లోకం దృష్టిలో ఆమె ప్రేమ తప్పు కావచ్చు. తనకు మాత్రం ఒప్పు కావచ్చు. తప్పొప్పుల సంగతి అలా ఉంచితే ‘నిరాకరణ’ ‘భగ్నప్రేమ’ నుంచి వచ్చిన ప్రతికూల శక్తులు ‘అమావాస్య’ రూపంలో భయపెడతాయేమో!
అందుకే ఆరోజు ఏది చేసినా అశుభం అంటారు. ప్రయాణాలకు ససేమిరా అంటారు. ముగ్గులు వేయకూడదంటారు. అదిగో ఈ అమవాస్య రోజున కూడా ఎవరో ఒక అమ్మాయి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది.
భగ్నప్రేమేనంటారా?!
మీరేమైనా నమ్ముతారా!!
- పాషా
అమావాస్య వెనక ఉన్న కథ
ప్రేమలో పిచ్చి ఉంటుంది. పిచ్చిలో ప్రేమ ఉంటుంది. ప్రేమ, పిచ్చి ఏకమై ఒకే స్వరమై అలిగి, చెలరేగిన పురాగాథ ఒకటి తెలుసా? ఇంతకీ అమావాస్యకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అమావాస్య అంటే చిమ్మచీకటి మాత్రమే కాదు. చీకటిలాంటి నిరాశ. విరహవేదన నుంచి ఘనీభవించిన రాత్రి.
మత్స్యపురాణం పద్నాలుగో అధ్యాయంలో అమవాస్య కథ ఉంది. పితృదేవతలకు అమావాస్య అంటే చాలా ఇష్టం. వీరు ఏడు గణాలుగా ఉంటారు. వీరిలో మూడు గణాల వారికి ఆకారం ఉండదు.
వారిని వైరాజులు, అగ్నిష్వాత్తులు, బర్హిషదులు అంటారు. సుఖాలినులు, హవిష్మంతులు, ఆజ్యవులు, సోమపులు అనే నాలుగు గణాలకు మాత్రం ఆకారం ఉంటుంది. ఈ ఏడుగణాలు ప్రాణులకు చైతన్యధారలు. అగ్నిష్వాత్తుల ముద్దుల కూతురు అచ్చోద. ఈవిడను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. అచ్చోద నదిరూపంలో ఉండేది. ‘మావసుడు’ అనే పితరుడు చూడగానే ఆకట్టుకునే అందగాడు. సౌమ్యుడు. అలాంటి మావసుడిని చూసి అచ్చోద మనసు పారేసుకుంది. ‘‘పెద్దలారా, చేసుకుంటే మావసుడినే పెళ్లి చేసుకుంటాను’’ అని పితృదేవతలతో చెప్పింది అచ్చోద. వావి వరసలు మరిచిన అచ్చోద ప్రేమ గురించి విని పితృదేవతలు ఆశ్చర్యపోయారు. వాళ్ల కాళ్లకింద భూమి కదిలినట్లయింది. మావసుడిని ప్రేమించిన కారణంగా అచ్చోద యోగశక్తి, దివ్యత్వాన్ని కోల్పోయింది. మావసుడు మాత్రం ఇంద్రియనిగ్రహంతో, విచక్షణ ఎరిగిన వాడై అచ్చోద ప్రేమలో పడలేదు. అచ్చోద మావస్య ప్రేమను దక్కించుకోలేదు. అతని చేత తిరస్కరించబడింది. ఈ కారణంగా అచ్చోద అమావాస్య అయింది.
అమావాస్య అంటే మావసుడి ప్రియురాలు కానిది అని.
కాలక్రమంలో అచ్చోద పేరు అమావాస్యగా స్థిరపడింది.

0 comments:
Post a Comment